కీ॥ శే॥ కామ్రేడ్ దువ్వూరు శ్రీనివాసులు రెడ్డి గారి జ్ఞాపకార్ధం DYFI గ్రామ కమిటి ఆద్వర్యం లో పల్లిపాడు గ్రామం లోని పినాకిని సత్యగ్రహ ఆశ్రమం నందు ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ప్రతి ఏట సంక్రాంతి ని పురస్కరించుకొని జరిగే ఈ ఆటల పోటీలు మరియు ముగ్గుల పోటీల లో గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. విజయతలుగా నిలిచినవారికి రామచంద్రరెడ్డి ప్రజా వైద్యశాల వైద్యులు Dr. రమణయ్య గారు, DYFI నాయకులు మురళి,శేషయ్య, శివయ్య , పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం కన్వినర్ గనేసం కృష్ణ రెడ్డి గారు,ఆశ్రమం కార్యనిర్వాహకులు నేదురుమల్లి సుబ్బారెడ్డి గారు,గ్రామ సర్పంచ్ గూడూరు జయరామయ్య , గ్రామ పెద్దలు గురువారం నాడు పినాకిని సత్యగ్రహ ఆశ్రమం లో బహుమతి ప్రధానం చేసారు.
స్వాతంత్రోద్యమ కార్యకర్తలకు శిక్షణ కేంద్రంగానూ, స్వాతంత్రోద్యమ నాయకులకు ఆశ్రమ ఆవాసం గాను గాంధీ మహాత్ముడు మూడు పర్యాయాలు విచ్చేసి చరిత్రకెక్కిన పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం వెలసిల్లిన నేల ఇది. గాంధీ ఆశ్రమం ( పినాకిని సత్యాగ్రహ ఆశ్రమం), గ్రామ శివాలయం , పెన్నానది, DIET కళాశాల,ప్రభుత్వ ఊన్నత పాటశాల , విశాలమైన క్రీడా మైదానం తో, పచ్చని పంట పొలాలతో కలకలలాడుతూ ఊండే గ్రామం పల్లిపాడు గ్రామం.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment